Prashanth Varma : జై హనుమాన్ లో మరిన్ని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ చూస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ అద్భుత విజయం సాధించింది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విడుదల అయిన ప్రతి భాషలో హనుమాన్ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది..ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.చిన్న సినిమాగా రిలీజ్ అయిన ”హనుమాన్” మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో హనుమాన్ మూవీ ఏకంగా 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.ఇదిలా ఉంటే ఇంతటి ఘన విజయం సాధించిన హనుమాన్ మూవీ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్ ను నిర్వహించింది.
ఈ 100 రోజుల సెలబ్రేషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ ఆ మాట నేను అంతగా నమ్మలేదు.కానీ ప్రేక్షకులంతా దాన్నినిజం చేశారు.నేను దర్శకుడిగా మారిన తరువాత ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే అది కేవలం వారం మాత్రమే ఆ థియేటర్ లో ఉంటుంది..ఇలాంటి పరిస్థితిలో కూడా హనుమాన్ మూవీని వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే అది మా సినిమా అదృష్టంగా భావిస్తున్నాం అని ప్రశాంత్ వర్మ తెలిపారు. అలాగే తాను తెరకెక్కించబోయే జై హనుమాన్ సినిమాలో పాత పాత్రలు కొనసాగుతూనే మరిన్ని సర్ప్రైజింగ్ పాత్రలు వచ్చి చేరతాయని ప్రశాంత్ వర్మ తెలిపారు.జైహనుమాన్ సినిమాని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాలో వుంటాయని ప్రశాంత్ వర్మ తెలిపారు .
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!