Site icon NTV Telugu

PM Modi: HCU భూముల వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని

Pmmodi

Pmmodi

హర్యానా యమునా నగర్ ర్యాలీలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసిన మోడీ.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మోడీ అన్నారు. అలాగే.. హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూములపై తొలిసారిగా స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుందని విమర్శించారు.

READ MORE: IAF: 10th అర్హతతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్స్.. కాంపిటిషన్ తక్కువ

“బీజేపీ మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి, జంతువులకు నష్టం జరిగితే ప్రమాదం. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మకద్రోహం జరుగుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజలు ఆందోళనలో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు ,బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తుంది. వికసిత భారత్ కోసం మా పార్టీ పని చేస్తుంది.” అని పీఎం మోడీ వ్యాఖ్యానించారు.

READ MORE: Airport Rankes: వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు.. దేంట్లో అంటే..!

Exit mobile version