పాటలు, సంగీతంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి IAF గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ లో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజిషియన్ ) పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అగ్నివీర్ ఎయిర్ మ్యూజిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన అర్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతో పాటు, అభ్యర్థులు సంగీత సంబంధిత అర్హతను కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు సంగీత అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి.
Also Read:UP: ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయిపై దాడి.. నిందితులకు ‘‘యోగి’’ మార్క్ ట్రీట్మెంట్.. వీడియో వైరల్..
అలాగే, పాటను సరైన శ్రుతి, లయతో పాడే కళను కలిగి ఉండాలి. అలాగే స్టాఫ్ నొటేషన్, టాబ్లేచర్, టానిక్ సోల్ఫా, హిందుస్తానీ కర్నాటిక్ నొటేషన్ సిస్టమ్‌లో ప్రావీణ్యం ఉండాలి. అగ్నివీర్ ఎయిర్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు జనవరి 1, 2005 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 162 సెం.మీ ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 152 సెం.మీ.గా నిర్ణయించబడింది.
Also Read:Minister Satya Kumar: అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు నెహ్రూ, ఇందిరా గాంధీ నిరాకరించారు..
రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, శారీరక పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష మొదలైన వాటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల జీతం అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 21 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 11 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Home Minister Anitha: బాణాసంచా తయారీ కేంద్రాలపై కొరవడిన నిఘా.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్‌లో చేరడానికి, అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన జాబితా నుంచి కనీసం ఒక వాయిద్యాన్ని వాయించడం తెలిసి ఉండాలి.
కచేరీ ఫ్లూట్ / పిక్కోలో
ఓబో
క్లారినెట్ (Eb / Bb)
సాక్సోఫోన్ (Eb / Bb)
ఫ్రెంచ్ హార్న్ (F / Bb)
ట్రంపెట్ (Eb / C / Bb)
ట్రోంబోన్ (Bb / G)
బారిటోన్
యుఫోనియం
ట్యూబా / బాస్ (Eb / Bb)
కీబోర్డులు / ఆర్గాన్ / పియానో
గిటార్ (అకౌస్టిక్ / లీడ్ / బాస్)
వయోలిన్ / వయోలా / స్ట్రింగ్ బాస్
డ్రమ్స్ / పెర్కషన్ (అకౌస్టిక్ / ఎలక్ట్రానిక్)
అన్ని భారతీయ శాస్త్రీయ వాయిద్యాలు