నేడు (డిసెంబర్ 1న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలకు, ఎన్నికలు జరగనున్న అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై ప్రతిపక్ష నాయకులు తరచుగా అంతరాయం కలిగించారు. గందరగోళం కారణంగా, లోక్‌సభ రోజంతా స్తంభించిపోయింది. సమావేశానికి ముందు, ప్రధాని మోడీ ప్రతిపక్ష నాయకులను సహకరించాలని, ఉభయ సభలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీలతో ఏకాభిప్రాయం సాధించడానికి, సభ సజావుగా…
హైదరాబాద్‌లో జీఎంఆర్ శాఫ్రాన్ ఎయిర్పార్క్ సెజ్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. శాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 12వ సారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, మేడ్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతదేశం గురించి నొక్కి చెప్పారు. మిషన్ మోడ్‌లో సెమీకండక్టర్లపై పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశంలోని ప్రజలు తయారు చేసే మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి వస్తాయన్నారు. రాబోయే కాలంలో భారతదేశం సెమీకండక్టర్ల కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 30-40…
PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
PM Modi: ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి పడిన వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయి. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. యాక్సియం-4 మిషన్పై మోడీ ప్రశంసలు గుప్పించారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామని.. ఐఎస్ఎస్ లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణం అని అన్నారు. భారత సైనిక పాటవాలను ప్రపంచ…
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వైద్యుడు యూరాలజీ క్లినిక్ పబ్లిసిటీ కోసం పాకిస్తాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన తీవ్ర వ్యాఖ్యలను క్రియేటివిటీగా ఉపయోగించి సోషల్ మీడియాలో దుమారం రేపాడు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన ప్రతీకార దాడి ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తెలివిగా వాడిన యూరాలజిస్ట్ అయిన శివేంద్ర సింగ్ తివారీ సోషల్ మీడియాలో తన క్లినిక్ కోసం ప్రమోషనల్ ప్రకటనను…
భారత వాయుసేన చూపించిన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో వాయుసేనను మోడీ కలిశారు.
PM Modi Speech: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై సోమవారం ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రసంగం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ దానికే బలవుతుందని అన్నారు.