ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు. పాకిస్థాన్‌ను కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భాగ్యమన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. పైలట్ అభినందన్ పాక్‌కు చిక్కినప్పు కూడా స్వార్థ రాజకీయాల కోసం ఇలాగే మాట్లాడారని.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని ప్రధాని మోడీ అన్నారు. “పాకిస్థాన్ నుంచి అభినందన్‌ను మోడీ ఎలా తెస్తారో చూస్తాం అన్నారు. మేము అభినందన్‌ని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చాం. విపక్షాల తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో నాపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు రుణపడి ఉన్నాను.’’ అని ప్రధాని అన్నారు.
READ MORE: Srinivas Goud: పదవులు, పైసలు, కాంట్రాక్టులు అన్ని మీకేనా?.. అనగదొక్కుతామంటే ఊరుకోము!
“నేడు ప్రపంచం మొత్తం మన వాయు రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటోంది. పాకిస్థాన్ కొన్ని నిమిషాల్లోనే వేల క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. కానీ మన వాయు రక్షణ వాటన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేసింది. ఇది మొత్తం దేశానికి గర్వకారణం. కానీ కొంతమంది దీనిని భరించడం కష్టంగా మారింది. కాంగ్రెస్ ప్రజలు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. పాకిస్తాన్ అదంపూర్ వైమానిక స్థావరం గురించి అబద్ధాలు వ్యాప్తి చేసింది. కానీ నేను స్వయంగా మరుసటి రోజు అక్కడికి చేరుకుని ఇది అసత్యమని అందరికీ నిరుపించాను. ఈ సంఘటన మన రక్షణ బలాన్ని స్పష్టంగా చూపించింది.” అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
READ MORE: PM Modi: కాల్పుల విరమణపై ట్రంప్ జోక్యం ఉందా..? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన మోడీ
