ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీసిన భారత్, ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపులకు తీవ్రమైన సమధానం ఇచ్చింది. పాకిస్తాన్ వైమానికదళానికి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై అటాక్ చేసింది. ఇందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫికీ, సర్గోదా, జకోబాబాద్, స్కర్దు వంటికి ఉన్నాయి.