PM Modi: నవ భారత్ ఎవరి ముందు వంగదని, ప్రజలను రక్షించడంలో వెనుకాడదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శుక్రవారం ఉడిపిలో జరిగిన ‘‘లక్ష కంఠ గీత పారాయణం’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ప్రస్తావించారు.
26/11 Mumbai Attack: 26/11 ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 17 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు.
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి భయాందోళనలు చెలరేగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6.52 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 10 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. పలువురు…
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, భారత్‌ను దాడులు ఆపేయాలని కోరకుంటే, అది వారికి ఘోరమైన విపత్తుగా మారేదని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మంగళవారం అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత, మే నెలలో భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలతో పాటు ఆ దేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. నాలుగు రోజుల ఈ సైనిక ఘర్షణ తర్వాత, పాకిస్తాన్ బ్రతిమిలాడటంతో భారత్ సైనిక చర్యను నిలిపేసింది.
PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గించారు. జపాన్ వాహనాలు, ఇతర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం జూలైలో కుదిరిన ఒప్పందం అమలులో భాగం. అమెరికా, జపాన్ మధ్య నెలల తరబడి జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం జపాన్ ఆటో పరిశ్రమకు ఉపశమనం కలిగించడమే కాకుండా, అమెరికాలో జపాన్ $550 బిలియన్ల పెట్టుబడికి మార్గం సుగమం…
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించడానికి, భవిష్యత్తులో సాంకేతికత ఆధారిత సవాళ్లను ఎదుర్కోవడానికి 2035 నాటికి ‘సుదర్శన్ చక్ర’ అనే జాతీయ భద్రతా కవచాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ మిషన్ వెనుక ఉన్న ప్రేరణను ప్రస్తావిస్తూ, ఇది శ్రీకృష్ణుని సుదర్శన చక్రం నుంచి ప్రేరణ పొందిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించిన మొత్తం పరిశోధన, అభివృద్ధి,…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ మాత్రం రష్యాతో బంధం కొనసాగుతుందని, టారిఫ్‌ల భారాన్ని మోసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎందుకిలా రెచ్చిపోతున్నారు? ఆయన రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటి? భారత్-రష్యా సంబంధాలను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. భారత్‌పై ట్రంప్ సుంకాలు..!…
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) మాస్కో పర్యటనకు వెళ్లారు. అయితే, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక సమావేశం జరగబోతుంది.