ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం షాజాద్, తాను ఎలాంటి నేరం చేయలేదని పేర్కొంటూ ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని, తనను ఇరికించడానికి కుట్ర పన్నారని అందులో పేర్కొన్నాడు. తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని ఇస్లాం తరఫు న్యాయవాది పిటిషన్‌లో పొందుపర్చారు. అతను ఎప్పుడూ ఏంటి నేరం చేయలేదని పిటిషన్‌లో వివరించారు.
మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు.. దీని గుర్తించి తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారు. మండలి చైర్మన్‌గా న్యూసెన్స్ అనే పదం వాడారు.. దాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు
జనం కొడతారని పారిపోయి ఢిల్లీ పారిపోయిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నీచమైన పనులు చేసే వ్యక్తిని చంద్రబాబు వెనకేసుకు వస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంటే కుట్రదారులందరూ రంగంలోకి దిగారు అని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని చంద్రబాబు కోసం లాబీయింగ్ చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. జైలుకు వెళ్ళకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ కు వెళ్ళాలని, పోలీసుల పై…