Anant Shastra: పాకిస్తాన్, చైనా సరిహద్ధుల్ని మరింత బలోపేతం చేయడానికి భారత సైన్యం సిద్ధమవుతోంది. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో వైమానిక రక్షణ నెట్వర్క్‌ను బలోపేతం చేయడానికి భారత సైన్యం ఐదు నుంచి ఆరు రెజిమెంట్ల ‘‘ అనంత శస్త్ర’’ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి టెండర్ జారీ చేసింది.
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.
భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శ్రీనగర్ మీదుగా పెద్ద ఎత్తున డ్రోన్ కార్యకలాపాలు జరిగినట్లు సమాచారం. శ్రీనగర్‌లో జరిగిన డ్రోన్ దాడి వీడియోను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు. పాకిస్థాన్ భారీ షెల్లింగ్‌కు దిగిందని.. కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు."ఇది కాల్పుల విరమణ కాదు. శ్రీనగర్ మధ్యలో ఉన్న వైమానిక రక్షణ విభాగాలు ఇప్పుడే తెరుచుకున్నాయి" అని సీఎం…
Operation Sindoor : పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ vs పాక్ ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఆకాశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన అత్యంత కీలక ఎయిర్ వార్నింగ్ వ్యవస్థ అయిన AWACS విమానం భారత వైమానిక దళం చర్యతో కూలిపోయింది. ఇది కేవలం ఓ విమానం నష్టం కాదు, దాయాది దేశానికి వ్యూహాత్మకంగా చెమటలు పట్టించే పరిణామం. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై…
జమ్మూలో ఈరోజు భారతదేశంపై పాకిస్థాన్ దాడి చేసింది. విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీని తరువాత ఎయిర్ సైరన్లు మోగాయి. జమ్మూ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్ విధించారు. జమ్మూలో 5-6 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. పాకిస్థాన్ డ్రోన్లు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించాయి. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు భారత సైన్యం…