ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోందని మోడీ ఆరోపించారు. సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. దీంతో ప్రజల మనస్సుల్ని గెలవలేరన్నారు.
Pakistan: పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 2019లో భారత్ చేపట్టిన ‘‘బాలాకోట్ ఎయిర్ స్టైక్స్’’ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అభినందన్ వర్థమాన్ అనుకోకుండా పాక్ ఆర్మీకి చిక్కారు. ఆ సమయంలో, ఆయనను పట్టుకున్న పాక్ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఇటీవల తాలిబాన్ దాడుల్లో హతమయ్యాడు. ఆయన అంత్యక్రియలను పాక్ సైన్యం పెద్ద ఎత్తున నిర్వహించింది.
Pakistan: పుల్వామా ఘటనకు బదులుగా భారత్ 2019లో ‘‘బాలాకోట్ వైమానిక దాడులు’’ నిర్వహించింది. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) పైలట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ -21 బైసన్ విమానంతో అత్యాధునిక అమెరికన్ తయారీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే, ఆ సమయంలో అభినందన్ ఫైటర్ జెట్ కూడా కుప్పకూలింది. అయితే, పారాశ్యూట్ సాయంతో ఆయన పాకిస్తాన్ భూభాగంలో దిగడంతో పాక్ ఆర్మీకి చిక్కారు.
Balakot Airstrike: బాలాకోట్ దాడులకు జరిగి నాలుగేళ్ల అయింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి పాాల్పడినందుకు గట్టిగా బుద్ది చెప్పింది. పుల్వామా ఎటాక్ లో 46 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై యావత్ దేశం పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి ఘటన పాల్పడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా గుణపాఠం చెప్పాలని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్…