PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం కానుందని ప్రొ కబడ్డీ లీగ్ నిర్వాహకులు మషాల్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రో కబడ్డీ లీగ్ యొక్క 10 సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద కబడ్డీ లీగ్ అక్టోబర్‌లో కొత్త సీజన్ కు చేరుకుంటుంది. సీజన్ 11లో, ప్రో కబడ్డీ లీగ్ మూడు నగరాల కారవాన్ ఫార్మాట్‌లో పూర్తి కానుంది. 2024 ఎడిషన్ అక్టోబరు 18న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి రెండో విడతగా నోయిడా ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. మూడో దశ డిసెంబర్ 3 నుంచి పూణెలోని బాలెవాడి బ్యాడ్మింటన్ స్టేడియంలో జరగనుంది. ప్లేఆఫ్‌ల తేదీలు, వేదికలు తర్వాత ప్రకటించబడతాయి.
Mega Star: వరద భాదితులకు అండగా ‘చిరు’ మెగా సాయం ఎంతంటే..?
PKL సీజన్ 11 తేదీల ప్రకటనపై ప్రో కబడ్డీ లీగ్ కమీషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.., 10 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత, PKL సీజన్ 11 లీగ్ ప్రపంచవ్యాప్తంగా కబడ్డీ నిరంతర వృద్ధిలో కొత్త మైలురాయిని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 వేలం ఆగస్టు 15 -16 తేదీలలో ముంబైలో జరిగింది. ఇందులో ఎనిమిది మంది ఆటగాళ్లను కోటి రూపాయలకు పైగా కొనుగోలు చేయడం లీగ్ చరిత్రలో కొత్త రికార్డు.
Pakistan Cricket: పాపం పాకిస్తాన్.. 3 సంవత్సరాలుగా విజయం లేదు!