Helicopter Crash: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన పైలట్, ఇద్దరు ఇంజనీర్లు మృతి చెందారు. పుణె జిల్లాలో బుధవారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడింటారు. అది ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ హెలికాప్టర్‌నా అనేది తెలియరాలేదు. బుధవారం పూణేలోని బవ్‌ధాన్ బుద్రుక్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని, ప్రాథమిక నివేదికలో తక్కువ దృశ్యమానత ప్రమాదానికి కారణమని సూచించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Bank Robbery: సూసైడ్ చేసుకుంటానంటూ 40 లక్షలు దోచుకెళ్లిన వ్యక్తి!
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. “పుణె జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ప్రస్తుతం మంటల్లో ఉన్న హెలికాప్టర్ ఎవరిది అనేది ఇంకా నిర్ధారించబడలేదు” అని తెలిపారు.