Fighter: మరోసారి హీట్ పెంచేసిన దీపికా .. ఈసారి ఆ హీరోతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fighter: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా కనిపించనుండగా.. స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా దీపికా పదుకొనేగా కనిపించనుంది. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ సందడి చేయనున్నారు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇంకా రిలీజ్ కు నెలరోజులే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లు మొదలుపెట్టేశారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సెకండ్ సింగిల్ ఇష్క్ జైసా కుచ్ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్మీడియాలో వైరల్ గా మారింది. సాంగ్ లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ఫుల్ రొమాటింక్ మోడ్‌లో ఉండగా.. వారిద్దరీ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సాంగ్ లో హృతిక్ రోషన్ డ్యాన్స్ స్టెప్పులు అదిరిపోయాయని నెటిజన్లు అంటున్నారు. హృతిక్ ఫిజిక్ కు ఫిదా అయ్యామని చెబుతున్నారు. ఈ సాంగ్ హృతిక్ పాటల్లో వన్ ది బెస్ట్ అవ్వనుందని అంటున్నారు. దీపిక కూడా అదరగొట్టేసిందని కామెంట్లు చేస్తున్నారు.సాధారణంగా హృతిక్ రోషన్ అంటేనే అమ్మాయిలు పడి చస్తారు. దీపికా పదుకొణెకు పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో మనకు తెలిసిందే. ఆమె అందాన్ని ఓ స్థాయిలో ఆరాధిస్తారు. అలాంటి ఇద్దరు కలిసి ఇలాంటి ఒక రొమాంటిక్ సాంగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అందరి దృష్టి పడిందని బీటౌన్లో టాక్. ఇప్పటికే పఠాన్ లో దీపికా షారుఖ్ తో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ తోనే అదరగొట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఈ భామ హృతిక్ తో జతకట్టింది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!