అందరూ చేతిరాతలు మర్చిపోతున్న కాలం ఇది.. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుంటే చేతి వేళ్లకే పని.. చాలా మందిలో టైపింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. చకచకా మెసేజ్ లు టైప్ చేసేస్తుంటారు. కంప్యూటర్ కీ బోర్డుపై వేళ్లతో అలవోకగా టైపింగ్ చేస్తుంటారు. అయితే ఓ ఫార్మసీ ఉద్యోగి మాత్రం వెరీ స్పెషల్ అండీ బాబు.. అవును అతని అద్భుతమైన టైపింగ్ స్పీడ్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూర్చున్న ఫార్మసీ ఉద్యోగి కస్టమర్లకు బిల్లింగ్ ఇస్తూ కనిపించాడు. అయితే అతను కంప్యూటర్ మీద వెళ్లను టైప్ చేస్తున్నాడా.. పరుగులు పెట్టిస్తున్నాడా.. అనేది అర్థం కాలేదు.. ఒక్క క్షణం మన కళ్లు కూడా చెదిరిపోయేంత స్పీడ్ గా అతని టైపింగ్ కనిపిస్తుంది.
This receptionist at a busy pharmacy in India. pic.twitter.com/lYk80QQGav
— CCTV IDIOTS (@cctvidiots) April 13, 2023
Read Also : Covid-19: భారీగా కరోనా కేసులు.. 50 వేలకు చేరిన యాక్టివ్ కేసులు..
పైగా మందుల కోడ్ లు టైప్ చేస్తూ ఒక దాని తర్వాత ఒకటి మందులు తీసుకుంటూ కంప్యూటర్ లో తన వేళ్లను పరుగులు పెట్టిస్తున్నాడు. అసలు అతను కీ బోర్డు వైపు కూడా చూస్తున్నాడా లేదా డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఎంప్లయి టైపింగ్ స్కిల్స్ చూసిన జనం తెగ మెచ్చుకుంటున్నారు. అతనికి వావ్ ఇంత స్పీడ్ గా టైపింగ్ చేస్తున్నాడు.. అంటూ మెచ్చుకుంటున్నారు. ఇతనికి ప్రత్యేకమైన టాలెంట్ ఉందని కొందరు.. ముచ్చటైన టైపింగ్ అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
Read Also : Mohammed Shami : బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరితో షమి