మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రాం 116వ జయంతి సందర్భంగా గుంటూరులోని స్థానిక పట్టాభిపురం, మార్కెట్ ఏరియాలోని ఆయన విగ్రహాలకు డాక్టర్ పెమ్మసాని, బూర్ల రామాంజనేయులు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అత్యంత ప్రభావవంతమైన నాయకులు బాబు జగ్జీవన్ రాం అన్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాలు, అడ్డంకులను కూడా లెక్కచేయకుండా తన గలాన్ని బలంగా వినిపించిన నాయకుడు అని పేర్కొన్నారు. ఆయన నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకొని నాయకులుగా ఎదగాలని తెలిపారు. అప్పుడే దళిత సోదరులు గళం బలంగా వినపడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Read Also: Manish sisodia: మనీష్ సిసోడియాకు చుక్కెదురు.. మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఇక, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో గల ముట్లూరు గ్రామంలో డాక్టర్ పెమ్మసాని రోడ్ షో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు. కానీ కాపు సోదరులంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నారనే కోపంతో జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ఒక పార్టీకి, ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కట్టేయలేదన్నారు. కష్ట సమయంలో టీడీపీకి అండగా ఉండి పొత్తులకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టీడీపీ, తాను ఉంటామని పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.
Read Also: Arun singh : ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ
అయితే, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి మోహన్, తన అనుచరులతో కలిసి 2 వేల మంది గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. గుంటూరు నుంచి ఉండవల్లి వరకు నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డాక్టర్. పెమ్మసాని తన రాజకీయ చతురతను ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలను చేరుస్తున్నారు. ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నారు. పలు పార్టీల నాయకులు టీడీపీలో చేరేట్టుగా ఆయన చక్రం తిప్పుతున్నారు.