పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర.. 11ఏండ్లు తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి…
KTR: బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయినవారికి పెన్షన్లకు పైసలు లేవా అని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో మందకృష్ణ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. Also Read: Ponnam Prabhakar: సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు…
దేశంలోనే మార్గదర్శకంగా కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాంగ్ డైరెక్షన్‌లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని.. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నామని ఎద్దేవా చేశారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండన్నారు. బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి…
Deputy CM Bhatti: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
కర్నాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వయసు నియమావళి ప్రకారం బీజేపీ యడ్యూరప్పను తప్పించిందని బీజేపీ చెబుతున్నది. అధిష్టానం తనపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, బీజేపీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేసినట్టు అటు యడ్యూరప్ప కూడా పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని మరోలా చూస్తున్నాయి. ముఖ్యమంత్రిని బలవంతంగా తప్పించారని సెటైర్లు వేస్తున్నాయి. అవినీతి కారణంగానే ముఖ్యమంత్రిని తొలగించి చేతులు కడుక్కోవాలని కేంద్రం చూస్తున్నట్టు కాంగ్రెస్…