Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
- డిప్యూటీ సీఎంతో పాటు నాలుగు శాఖలు అప్పగింత
- పదేళ్ల పవన్ పోరాటానికి దక్కిన ఫలితం
- బాధ్యతల స్వీకరణ అనంతరం జనసేనాని పని తీరుపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జనం
పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల్ని తనను ఆదరించకపోయినా… రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. మూడో సారి ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించాడు. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కల్యాన్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. కాగా.. 19వ తేదీన జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జనసేనాని పని తీరుపై ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
READ MORE: Action King Arjun : ప్రముఖుల సమక్షంలో వైభవంగా ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల రిసెప్షన్ వేడుకలు..
Also Read
- KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
- Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
- Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- West Bengal elections: బెంగాల్‌లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపుపై ఉత్కంఠే కొనసాగింది. చివరకు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కీలక శాఖలు దక్కాయి. డిప్యూటీ సీఎం పదవితో పాటు.. ఆయనకు నాలుగు శాఖలు అప్పగించారు. కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు. జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలశాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు.. అలాగే మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!