Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- గిరిజనుల అభివృద్ధే బీజేపీ లక్ష్యం: నితిన్ నబీన్
- తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటోంది కాంగ్రెస్
- పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించింది బీజేపీ
- కేంద్ర పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం (ATM) లాగా వాడుకుంటోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆ పార్టీ నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్‌లో జరిగిన గిరిజన నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చారిత్రాత్మక వరంగల్ మట్టిలో నాటి సమ్మక్క-సారలమ్మల వీరత్వపు స్ఫూర్తి ఇప్పటికీ ఇక్కడి గిరిజన మహిళల్లో స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు.
గిరిజనుల సమగ్ర అభివృద్ధే బీజేపీ లక్ష్యం
గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న చోట్ల ఇప్పటికీ భూములకు సంబంధించిన ల్యాండ్ సర్వేలు జరగలేదని, ఉగ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల్లో ఇంతకాలం గిరిజనుల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని నితిన్ నబీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గిరిజనుల సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. గత యూపీఏ (UPA) కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే.. నేడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏకంగా రూ. 15 వేల కోట్లను గిరిజనుల సంక్షేమం, ప్రగతి కోసం ఖర్చు చేస్తోందని లెక్కలతో సహా వివరించారు.
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ఎలాంటి లాభం ఆశించకుండానే తెలంగాణకు బీజేపీ మద్దతు
నాడు ఎలాంటి రాజకీయ లాభాలు, స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని నితిన్ నబీన్ గుర్తుచేశారు. ఆనాడు బీజేపీ అగ్రనేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో చిన్నమ్మగా మారి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానో కొట్లాడారని స్మరించుకున్నారు. రాహుల్ గాంధీ ఒక పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, కానీ బీజేపీలోని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ప్రజా సేవ కోసం అంకితమైన ఫుల్ టైమ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ మాటను పూర్తిగా మరిచిపోయి నిరుద్యోగులను వంచించిందని మండిపడ్డారు.
పీవీని కాంగ్రెస్ అవమానిస్తే.. బీజేపీ భారతరత్నతో గౌరవించింది
దేశానికి ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విస్మరించిందని నితిన్ నబీన్ ఆరోపించారు. పీవీ మరణించిన సమయంలో ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా అవమానించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించి అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఇచ్చి సముచితంగా గౌరవించిందని గుర్తుచేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని, చేస్తున్న ప్రతి మంచి పనిని బూత్ కమిటీ కార్యకర్తలు బాధ్యతగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేలా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!