పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు.