Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్‌గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cleaning Tips: ఇంట్లో ఇల్లాలు ఎక్కువ సమయం గడిపే ప్రదేశం వంటగది. అది ఎప్పుడూ శుభ్రంగా, నీట్‌గా ఉంటే వంట చేయడానికి ఒక మంచి అనుభూతి వస్తుంది. లేదంటే వంటగదిలోకి వెళ్లడానికే చిరాకు వేస్తుంది. మరి ఎలాంటి శ్రమ లేకుండా, రోజూ చిన్న చిన్న జాగ్రత్తలతో వంటగదిని ఎల్లప్పుడూ ఎలా శుభ్రంగా ఉంచుకోవచ్చో తెలుసా. ఈ స్టోరీలో మీ వంట గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.
* వంటగదిలో అన్నింటికీ ఒకే టవల్ వాడకూడదు. స్టవ్ తుడవడానికి, ప్లేట్లు/లంచ్ బాక్స్‌లు తుడవడానికి, ఫ్రిజ్ కోసం దేనికదే విడివిడిగా చిన్న కాటన్ టవల్స్ ఉపయోగించడం వల్ల పరిశుభ్రత పెరుగుతుంది.
Also Read
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
* కూరగాయలు కట్ చేసేటప్పుడు ప్లాట్‌ఫారమ్ అంతా చెత్త కాకుండా, పాత ప్లాస్టిక్ డబ్బాలను చిన్న చాటలా కట్ చేసి బోర్డు కింద పెట్టుకోవాలి. తొక్కలను నేరుగా అందులోకి నెట్టేయడం వల్ల ప్లాట్‌ఫారమ్ క్లీన్‌గా ఉంటుంది.
* రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ లేదా బిర్యానీ బాక్స్‌లకు చిన్న రంధ్రాలు చేసి సింక్‌లో ఉంచాలి. గిన్నెలు కడిగేటప్పుడు వచ్చే అన్నం గింజలు, వేస్ట్ అంతా అందులో వేయడం వల్ల సింక్ పైపులు జామ్ అవ్వవు, దుర్వాసన రాదు.
* వంట స్టార్ట్ చేసే ముందే స్టవ్ పక్కన ఒక పెద్ద ప్లేట్ పెట్టుకోవాలి. వంట కలిపిన గరిటలను నేరుగా స్టవ్ మీద లేదా ప్లాట్‌ఫారమ్ మీద పెట్టకుండా ఈ ప్లేట్లో ఉంచితే జిడ్డు కాకుండా ఉంటుంది.
* పాలు పొంగినా, మిక్సీపై ఏవైనా పడినా, ఆయిల్ బాటిల్స్ జిడ్డుగా మారినా.. బట్టల సంచులు ముక్కలుగా కట్ చేసి దాంతో వెంటనే తుడిచేయాలి. దీనివల్ల మరకలు గట్టిపడి జిడ్డుగా మారవు.
* ముద్దపప్పు లేదా టమాటా పప్పు వండేటప్పుడు కుక్కర్ విజిల్ నుంచి నీరు పొంగి స్టవ్ పాడవకుండా ఉండాలంటే, పప్పుతో పాటు కుక్కర్ లోపల ఒక చిన్న స్టీల్ స్పూన్ వేసి ఉడికించాలి.
* మిక్సీ, గ్రైండర్, రైస్ కుక్కర్ల వైర్లు చిక్కుపడకుండా ఉండటానికి పాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పై భాగాన్ని (నెక్) కట్ చేసి, మధ్యలో చీలిక ఇచ్చి వైర్లకు క్లిప్‌లా అమర్చాలి.
* ఫ్రిజ్ ట్రేలపై రంగురంగుల మ్యాట్లు వేసుకోవడం వల్ల సాస్‌లు, పాలు వంటివి వలికినా నేరుగా ట్రేలు పాడవువు. కేవలం మ్యాట్లను తీసి ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మిగిలిపోయిన చిన్న బ్రెడ్ ముక్కను లోపల ఉంచాలి.
* గ్లాస్ ఆయిల్ బాటిల్స్ లోపల జిడ్డు వదలడం కష్టం. అందుకోసం ఒక గరిటెడు దోస పిండిని బాటిల్లో వేసి బాగా తిప్పి 5 నిమిషాలు ఉంచాలి. పిండి ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత వేడి నీళ్లు, డిష్ వాష్ లిక్విడ్‌తో కడిగితే బాటిల్ కొత్తదానిలా మెరుస్తుంది.
* ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ‘పచ్చ కర్పూరం’ పొడి కలిపి, వడగట్టి స్ప్రే బాటిల్లో పోసుకోవాలి (కావాలంటే కొద్దిగా విమ్ లిక్విడ్ కూడా కలపవచ్చు). వంట పూర్తయ్యాక దీన్ని స్టవ్, ప్లాట్‌ఫారమ్, డైనింగ్ టేబుల్‌పై స్ప్రే చేసి తుడిస్తే జిడ్డు వదలడమే కాకుండా ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. ఇల్లంతా అద్భుతమైన సువాసన కూడా వస్తుంది.
* స్టవ్ లైటర్ జిడ్డు వదలడానికి కాటన్‌పై కొద్దిగా ‘లైజాల్’ వేసి తుడిచి, లోపలి భాగాన్ని ఇయర్ బడ్స్‌తో క్లీన్ చేయాలి.
* కిచెన్ స్విచ్ బోర్డుల జిడ్డు వదిలించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ వాడితే ఎలాంటి లిక్విడ్స్ స్ప్రే చేయకుండానే మురికి మాయమవుతుంది.
* వంటగదిలో బొద్దింకలు రాకుండా ఉండటానికి ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో రెండు కలరా ఉండలు, ఒక స్పూన్ ఘాటైన కారప్పొడి వేసి, ఆ డబ్బా మూతకు చిన్న రంధ్రాలు చేసి సింక్ కింద లేదా కబోర్డ్స్ లో ఉంచాలి. ఆ ఘాటుకు బొద్దింకలు దరిచేరవు.
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..