6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy M47 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Galaxy M47 5Gను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌ను అందించారు. 4nm టెక్నాలజీ ఆధారంగా రూపొందిన ఈ మంచి మెరుగైన పనితీరు, తక్కువ పవర్ వినియోగాన్ని అందిస్తుంది. దీనికి LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ జత కావడంతో యాప్స్ వేగంగా ఓపెన్ అవడం, మల్టీటాస్కింగ్ సాఫీగా సాగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ ఫోన్లో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందించారు. ఫోన్‌ను ఛార్జింగ్‌కు కనెక్ట్ చేసి గేమింగ్ చేస్తున్న సమయంలో పవర్ నేరుగా ప్రాసెసర్‌కు వెళ్లేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. దీంతో బ్యాటరీపై ఒత్తిడి తగ్గి, వేడి సమస్యలు తగ్గడంతో పాటు ఎక్కువసేపు స్థిరమైన పనితీరు లభిస్తుంది. ఈ కొత్త మొబైల్ లో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో స్మూత్ అనుభూతిని అందిస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1400 నిట్స్ బ్రైట్నెస్ను అందించగలదు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ ఉండటంతో స్క్రాచ్‌లు, చిన్నపాటి పడిపోవడాల నుంచి స్క్రీన్కు అదనపు భద్రత లభిస్తుంది.
Also Read
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో ఒకటి కంటే ఎక్కువ రోజులు బ్యాకప్ అందించేలా దీన్ని రూపొందించారు. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని రీచార్జ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనికి 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ జతచేశారు. ఈ కెమెరా సెటప్ 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. తక్కువ వెలుతురులో మెరుగైన ఫోటోలు తీసేందుకు శాంసంగ్ నైట్పోగ్రఫీ టెక్నాలజీని కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
శాంసంగ్ గాలక్సీ M47 5G ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ One UI 8.5తో వస్తుంది. ఈ ఫోన్‌కు 6 ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది. ఈ ఫోన్లో Google Gemini, Circle to Search వంటి AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే Samsung Wallet ద్వారా Tap & Pay సపోర్ట్, On-Device Voice Mail, Knox Vault సెక్యూరిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Samsung Galaxy M47 5G రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. రోగ్ రెడ్, బ్లజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కూపన్ ఆఫర్‌తో కలిపి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.22,999గా నిర్ణయించారు. జూలై 4 నుంచి ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలతో అందుబాటులోకి రానుంది.
Power up your play!
The all-new #GalaxyM47 5G is here to take your gaming to the next level!
Enjoy smooth performance powered by Snapdragon processor and Fast LPDDR5X RAM. Keep every session going with a long-lasting battery, and every detail vivid on a bright super AMOLED… pic.twitter.com/HzHGrRwLz7— Samsung India (@SamsungIndia) June 29, 2026
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!