CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా
- ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వించండి
- నిర్దేశిత గడువులోగా రాజధాని నిర్మాణాలు పూర్తి కావాలి
- రాజధాని పనులపై ప్రతీ 2 నెలలకు ఒకసారి సమీక్ష
- అమరావతి నిర్మాణ కాంట్రాక్టు సంస్థలతో సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం జరగాలని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమీక్ష నిర్వహించారు.
నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ ఫ్రా, సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5140కి పైగా భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకమూ లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వీలుగా వాటిని వెడల్పు చేస్తు్న్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. భవిష్యత్ నగరంగా నిర్మిస్తు్న్న అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్ ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు.
కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి పవిత్రమైన మట్టి, నీళ్లు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని.. గత పాలకులు ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని సీఎం అన్నారు. గడచిన రెండేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మళ్లీ గాడిలో పెట్టామన్నారు. అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా నిర్మాణం చేస్తున్న అమరావతిలో భాగస్వాములం అయ్యామన్న ఆలోచనతో కాంట్రాక్టు సంస్థలు పనిచేయాలని సీఎం సూచించారు.
పనులు పూర్తి అయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యత పై కూడా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని పేర్కొన్నారు. అమరావతికి పేరు తెచ్చేలా ఈ భవనాలను నిర్మించాలన్నారు. రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ రెండు నెలలకు ఒకసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!