టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony BRAVIA 9 II, BRAVIA 7 II : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ (Sony) భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం టెలివిజన్ సిరీస్‌ను లాంచ్ చేసింది. 2026 ఫ్లాగ్షిప్ మోడల్‌గా Sony BRAVIA 9 IIతో పాటు BRAVIA 7 II టీవీలను అధికారికంగా లాంచ్ చేసింది. అత్యాధునిక True RGB LED టెక్నాలజీ, AI ఆధారిత పిక్చర్ ప్రాసెసింగ్, మెరుగైన బ్రైట్నెస్ కంట్రోల్, అత్యుత్తమ కలర్ రిప్రొడక్షన్ వంటి ఫీచర్లతో ఈ టీవీలు వినియోగదారులకు థియేటర్ లెవెల్ అనుభూతిని అందించనున్నాయి.
అద్భుతమైన విజువల్స్:
BRAVIA 9 II, BRAVIA 7 II టీవీలు True RGB LED టెక్నాలజీని ఉపయోగిస్తున్న తొలి BRAVIA మోడళ్లుగా నిలిచాయి. ఇందులో ఉపయోగించిన RGB బ్యాక్ లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రో టెక్నాలజీ ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల LEDలను విడివిడిగా నియంత్రించి మరింత ఖచ్చితమైన కాంతిని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల రంగులు మరింత సహజంగా కనిపించడంతో పాటు, కాంట్రాస్ట్ లెవెల్స్ మెరుగుపడతాయి. అలాగే బ్లూమింగ్ ఎఫెక్ట్ తగ్గి, డీప్ బ్లాక్స్, అధిక బ్రైట్నెస్, విశాలమైన వ్యూయింగ్ యాంగిల్స్ లభిస్తాయి.
Also Read
- చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
- Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
- Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
- Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
Your home. Your cinema.
Introducing BRAVIA 9 II — Sony's flagship True RGB TV. Powered by RGB Backlight Master Drive Pro, it delivers the largest colour volume and brings every scene to life as the filmmaker intended.#CinemaIsComingHome
Know more: https://t.co/DLtIBPq1QB pic.twitter.com/ldF8PUlECK
— Sony India (@sony_india) June 29, 2026
ఈ టీవీలలో Cognitive Processor XR ప్రాసెసర్‌ను అందించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రతి సన్నివేశాన్ని విశ్లేషించి రంగులు, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ను రియల్ టైమ్‌లో ఆప్టిమైజ్ చేస్తుంది. అంతేకాకుండా XR కాంట్రాస్ట్ బూస్టర్, RGB ట్రీలుమినోస్ మాక్స్, లుమినన్స్ బూస్టర్ ప్రో, స్మూత్ కలర్ గ్రేడేషన్ వంటి టెక్నాలజీలు కూడా చిత్ర నాణ్యతను మరింత మెరుగుపరుస్తాయి.
అద్భుతమైన వీక్షణ:
BRAVIA 9 IIలో ఇమ్మెర్సివ్ బ్లాక్ స్క్రీన్ ప్రో ఫీచర్‌ను అందించారు. ఇది స్క్రీన్‌పై ప్రతిబింబాలను తగ్గించి ప్రకాశవంతమైన గదుల్లో కూడా స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. అదే సమయంలో బ్లాక్ లెవెల్స్, షాడో డిటైల్స్‌ను కాపాడుతుంది.
థియేటర్ స్థాయి ఆడియో:
సోనీ ఈ టీవీల్లో శక్తివంతమైన ఆడియో సిస్టమ్‌ను కూడా అందించింది. ఎకౌస్టిక్ మల్టీ-ఆడియో+ టెక్నాలజీతో పాటు సౌండ్ పొజిషనింగ్ ట్వీటర్లు, అప్-ఫైరింగ్ బీమ్ ట్వీటర్లు, ఫుల్ -రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి. అలాగే వాయిస్ జూమ్ 3 ఫీచర్ AI సహాయంతో డైలాగ్‌లను మరింత స్పష్టంగా వినిపిస్తుంది. 3D సరౌండ్ అప్ స్కేలింగ్ ద్వారా చుట్టూ ఉన్నట్లుగా సౌండ్ అనుభూతిని అందిస్తుంది.
🔴🟢🔵Introducing two new Sony BRAVIA True RGB TVs, the BRAVIA 9 II and the BRAVIA 7 II, and the new BRAVIA Theater Trio sound system! Our new RGB technology TVs bring our brightest and most colorful TVs ever using a true three diode RGB technology.https://t.co/vA2zgyLixu pic.twitter.com/SV07YPsJoE
— Sony Electronics (@SonyElectronics) May 27, 2026
AI ఫీచర్లతో స్మార్ట్ అనుభవం:
ఈ టీవీలు Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. యాప్స్, సినిమాలు, టీవీ షోలు, గేమ్స్ అన్నింటినీ ఒకే ఇంటర్ఫేస్లో అందిస్తాయి. భవిష్యత్ OTA అప్డేట్ ద్వారా Gemini for Google TV సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. దీనివల్ల AI ఆధారిత కంటెంట్ సెర్చ్, వాయిస్ ఇంటరాక్షన్ వంటి ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
My Cinema Mode, Netflix Calibrated Mode, Prime Video Calibrated Mode, Sony Pictures Core సపోర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరలు:
Sony BRAVIA 9 II టీవీలు 75 అంగుళాలు, 85 అంగుళాల స్క్రీన్ సైజ్‌లలో అందుబాటులోకి వచ్చాయి. వీటి బెస్ట్ బై ధరలు వరుసగా రూ.5,39,990 మరియు రూ.6,69,990గా నిర్ణయించారు. Sony BRAVIA 7 II టీవీలు 55, 65, 75, 85 అంగుళాల స్క్రీన్ సైజ్‌లలో లభిస్తున్నాయి. వీటి ధరలు రూ.2,21,990 నుంచి ప్రారంభమై రూ.5,29,990 వరకు ఉన్నాయి. ఈ టీవీలు సోనీ సెంటర్ స్టోర్లు, సోనీ ఎక్సక్లూజివ్ షోరూమ్‌లు, ShopatSC.com, ప్రముఖ రిటైల్ అవుట్లెట్లు, ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!