JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda: విద్యార్థి ఉద్యమాలు, పోలీస్ చర్యలు, పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలతో దేశ రాజకీయం తీవ్ర ఉత్కంఠగా మారింది. విద్యార్థి నేతలపై పోలీసుల దాడులపై అధికార, ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ వేదికగా విమర్శల యుద్ధం నడిచింది. నిరసనల్లో పాల్గొనే విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం సహజమేనని, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు చర్యలు పూర్తిగా సమర్థనీయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు పోలీస్ చర్యలకు సిద్ధపడాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) రోజుల్లో విద్యార్థి నాయకుడిగా ఉన్న తాను కూడా క్లాస్రూమ్ నుంచే రెండుసార్లు అరెస్ట్ అయ్యానని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అయితే బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యానికి, ప్రజల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఘాటుగా విమర్శించారు. జులై 20న విద్యార్థి నిరసనకారులపై క్రూరంగా దాడి చేసిన వాళ్లు ఇంకా నిర్భయంగా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఈ పోలీస్ క్రూరత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే పార్లమెంట్లో సమాధానం చెప్పాలని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు, సీపీఐ(ఎమ్) జాతీయ కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు అకస్మాత్తుగా ప్రవేశించి, విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్‌ను అరెస్ట్ చేయడానికి యత్నించిన ఘటన ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనడమే ఆమె చేసిన ఏకైక నేరమా అని సీపీఐ(ఎమ్) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒక జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొరబడి దాడులు చేయడంపై తాను స్వయంగా పోలీసులను నిలదీశానని, అయితే 2021 నాటి జేఎన్‌యూ నిరసన కేసును సాకుగా చూపించారని ఆయన ఆరోపించారు. విపక్షాల నిరసనలను అణచివేయడానికే కేంద్రం ఇలాంటి దమనకాండకు ఒడిగడుతోందని దుయ్యబట్టారు.
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
సభలో ఇతర కార్యకలాపాలు చేపట్టే ముందే హోంమంత్రి దీనిపై ప్రకటన చేయాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో లోక్‌సభ తీవ్ర గందరగోళంగా మారింది. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడటానికి ముందు కూడా ప్రతిపక్షాలు రగడను కొనసాగించడంతో, సభను వాయిదా వేస్తానని స్పీకర్ హెచ్చరించాల్సి వచ్చింది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, బలప్రయోగం చేయడం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలం నాటి రజకార్ల అణచివేత కంటే అత్యంత ఘోరంగా ఉందని, దేశంలో అణచివేత వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!