IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Minister Sridhar Babu: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఐటీ హబ్స్, టవర్లపై అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. యాంకర్ పార్టనర్స్ లేదా ఇండస్ట్రీ పార్టనర్స్ భాగస్వామ్యం లేకుండానే గతంలో వీటిని నిర్మించడం వల్ల చాలా చోట్ల ఇవి నిరుపయోగంగా మారాయని తెలిపారు. నిజామాబాద్ ఐటీ టవర్, ఐటీ హబ్‌పై శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు శ్రీధర్ బాబు శాసనసభ వేదికగా సమాధానమిచ్చారు. ప్రణాళికారాహిత్యంతో మూతపడిన ఐటీ హబ్‌లను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని స్పష్టం చేశారు.
“హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు.. నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ లాంటి టైర్ – 2 నగరాలకూ ఐటీ కంపెనీలకు విస్తరిస్తున్నాం. త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ హబ్/టవర్‌ను లాంఛనంగా ప్రారంభించబోతున్నాం. యాంకర్ పార్ట్ నర్స్/ఇండస్ట్రీ పార్ట్ నర్స్ ముందుకొస్తే కొత్తగా ఐటీ హబ్స్/టవర్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం ఏ మాత్రం సహకరించడం లేదు. ఈ విషయంలో బీజేపీ సభ్యులు చొరవ తీసుకోవాలి. తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేలా మా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. గత రెండేళ్లలో 75కి పైగా జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఇది దేశంలోనే రికార్డు. రెండేళ్ల హయాంలో లక్ష మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు దక్కాయి. త్వరలోనే కొత్త జీసీసీ పాలసీని తీసుకొస్తున్నాం. ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ఐటీ కంపెనీలకు సంబంధించిన కాంప్రహెన్సివ్ ఎకో సిస్టంను అభివృద్ధి చేయడంలో డేటా సెంటర్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అందుకే.. వాటిపైన ప్రత్యేక దృష్టి సారించాం. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల వల్ల ఏర్పడబోయే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. స్థానిక అవసరాలకు ఇబ్బంది తలెత్తకుండా డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాల్లోనూ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.” అని శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!