Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Sledges Tilak Varma: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ నాలుగో రోజు తెలుగు ప్లేయర్ తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తొలి రోజు తిలక్ తనను స్లెడ్జ్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. బదులు తీర్చుకున్నాడు. తిలక్ వ్యవహరించిన దానికి అదే రీతిలో వైభవ్ బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తిలక్ వర్మ సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తిలక్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు బుడ్డోడు కూడా అలానే రియాక్ట్ అయ్యాడు. తిలక్ వర్మను భుజంతో గుద్దాడు. దీంతో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై అంపైర్ వైభవ్‌తో కాసేపు మాట్లాడాడు. అయితే 15 ఏళ్ల వైభవ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా.. తొలి ఇన్నింగ్స్‌లో తనకు కూడా ఇలాగే జరిగిందంటూ అంపైర్‌కు సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘సర్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాకు కూడా ఇలాగే జరిగింది’ అంటూ వైభవ్ చెప్పిన మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. తిలక్ వర్మకు తనదైన శైలిలో వైభవ్ ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ఈ సరదా స్లెడ్జింగ్‌లో వైభవ్ సూర్యవంశీదే పైచేయిగా నిలిచింది. ఈ వీడియో చూసిన వాళ్లు బుడ్డోడిపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు’, ‘వైభవ్.. తగ్గేదేలే’, ‘ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించి దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా సౌత్ జోన్‌ను ఓడించి.. మూడోసారి ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో చెలరేగడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం సౌత్ జోన్‌ను 325 పరుగులకే ఆలౌట్ చేసింది. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్ తరఫున తిలక్ వర్మ 99 పరుగులు చేశాడు. అయినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.
Pure drama in the #DuleepTrophy 2026 Final! 🍿#TilakVarma had a word for #VaibhavSooryavanshi in the 1st innings… and the youngster served it right back while Tilak was batting! 🔥🗣️ pic.twitter.com/DPdi3iwVRA
— Star Sports (@StarSportsIndia) September 10, 2026
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!