IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- ఒప్పో కే14 లైట్ సెప్టెంబర్ 16, 2026న భారత్‌లో లాంచ్
- 7,000mAh భారీ బ్యాటరీ
- 120Hz అల్ట్రా బ్రైట్ డిస్ప్లే, ఫోన్‌కు IP64 రేటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO K14 Lite Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) భారత్‌లో మరో కొత్త K-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఒప్పో కే14 లైట్ (OPPO K14 Lite) పేరుతో వస్తున్న ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 16, 2026న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. రోజువారీ వినియోగంతో పాటు ఎక్కువ కాలం మన్నిక కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది కంపెనీ.
ఒప్పో కే14 లైట్లో 7,000mAh బ్యాటరీ అందించనుంది. ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. ఈ బ్యాటరీ సుమారు ఆరు సంవత్సరాల పాటు మన్నికగా పనిచేసేలా రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz అల్ట్రా బ్రైట్ డిస్ప్లే ఉంటుంది. అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు, ఇతర రోజువారీ పనులు స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. అలాగే బయట ప్రకాశవంతమైన వాతావరణంలో స్క్రీన్‌ను సులభంగా చూడటానికి డిస్ప్లేను రూపొందించారు.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
మన్నిక విషయంలోనూ ఈ మొబైల్ పై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ లభించింది. దీంతో దుమ్ము, రోజువారీ వినియోగంలో ఎదురయ్యే నీటి చినుకులు, స్వల్ప స్ప్లాష్‌ల నుంచి రక్షణ లభించనుంది. సాఫ్ట్వేర్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ఓఎస్ 16తో నేరుగా అందుబాటులోకి రానుంది. మెరుగైన సిస్టమ్ పనితీరు, స్మూత్ ఆపరేషన్, కొత్త ఇంటర్ఫేస్ ఫీచర్లను ఇందులో అందించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది. ఫెదర్ పర్పుల్, స్టోన్ బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించనుంది. ఒప్పో కే14 లైట్‌కు సంబంధించిన పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్లు, అధికారిక ధర, రిటైల్ లభ్యత వంటి వివరాలను కంపెనీ సెప్టెంబర్ 16న జరిగే లాంచ్ ఈవెంట్లో వెల్లడించనుంది. దీంతో ఈ ఫోన్ ధర ఎంత ఉండనుంది, ఇతర ఫీచర్లు ఏమిటనేది లాంచ్ రోజున స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?