YSRCP Protest: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.. Read Also:…
POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) హింసాత్మక ఆందోళనలు జరిగిన కొన్ని వారాల తర్వాత, మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఈసారి జెన్-Z నేతృత్వం నిరసనలు జరుగుతున్నాయి. విద్యార్థులు విద్యా సంస్కరణలపై, పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు.
Nalgonda: నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులపై రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
R. Krishnaiah: రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, అల్ ఇండియా ఓబీసీ…
జన సమితి కోదండ రామ్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేలంపై ఆయన మాట్లాడారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని... ఈ భూములను కాపాడుతామన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులని గుర్తు చేశారు. ఈ భూములను రాబర్ట్ వాద్రా కోసమే అమ్ముతున్నావా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ భర్త కోసమే భూముల అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ దొంగ…
హెచ్సీయూ భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు…
హెచ్సీయూ భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది.. నిరసనలు ఉద్ధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది.. ఉదయం 10.30 కు హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తోంది. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం ఈ రోజు వర్సీటీకి వెళ్లనున్నారు. బీజేపీ హెచ్సీయూ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తోంది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. హెచ్సీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సీపీఎం పిలుపునిచ్చింది.…
వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొదంటూ హెచ్‌సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన ఇద్దరు పరిశోధక విద్యార్థులను రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్‌సీయూ భూములను వారు…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం రాజకీయ మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై విద్యార్థుల ఆందోళనలతో పాటు రాజకీయ నాయకుల ప్రస్తావనలు పెరుగుతున్నాయి. తాజాగా, తెలంగాణ భవన్‌లో HCU విద్యార్థులతో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ ఆందోళనలను వ్యక్తం చేయగా, కేటీఆర్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “HCU భూములు అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆరాటపడుతుంది?”…
ఓయూలో నిర్భంద ఆంక్షలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల చేయడం కలకలం రేపుతోంది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ ధ్వజమెత్తింది. ఈ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.