7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- నూబియా నావిక్స్ అల్ట్రా 7.62 మిల్లీమీటర్ల స్లిమ్ డిజైన్‌తో రానుంది
- ఈ ఫోన్లో 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nubia NaviX Ultra: నూబియా (Nubia) నుండి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ నూబియా నావిక్స్ అల్ట్రా (Nubia NaviX Ultra) కీలక స్పెసిఫికేషన్లను అధికారికంగా అందించారు. స్లిమ్ డిజైన్‌తో పాటు భారీ బ్యాటరీని అందించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. కేవలం 7.62 మిల్లీమీటర్ల మందంతో ఉండే ఈ ఫోన్లో 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు.
పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ సన్నగా ఉండేలా అధునాతన బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించినట్లు నూబియా తెలిపింది. ఛార్జింగ్ విషయానికి వస్తే 90W/100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. పనితీరు కోసం నూబియా నావిక్స్ అల్ట్రాలో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మెమరీ విభాగంలో చాంగ్షిన్ మెమరీ టెక్నాలజీస్ (CXMT) తయారు చేసిన LPDDR5X ర్యామ్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 10,667Mbps ట్రాన్స్మిషన్ వేగాన్ని అందిస్తుంది.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
సెప్టెంబర్ 4న ఇరు కంపెనీలు చేసిన ప్రకటన ప్రకారం, 10,667Mbps వేగం కలిగిన దేశీయంగా తయారైన మొబైల్ DRAMను వాణిజ్య స్థాయిలో భారీగా ఉత్పత్తి చేసిన స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో హై-స్పీడ్ దేశీయ మెమరీ చిప్ సరఫరా వ్యవస్థకు ఇది కీలక ముందడుగుగా నిలవనుంది. కెమెరాల విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్ లెన్స్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. పెరిస్కోప్ లెన్స్ ద్వారా ఆప్టికల్ జూమ్ సదుపాయం లభించనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరాను అందించారు.
కృత్రిమ మేధ (AI) ఫీచర్లకు కూడా ఈ ఫోన్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. జెడ్‌టీఈ, బైట్‌డాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ డివైజ్‌ను అంతర్గతంగా, వినియోగదారుల కోసం “డౌబావో ఫోన్ 2.0”గా పేర్కొంటున్నారు. బైట్‌డాన్స్‌కు చెందిన డౌబావో ఏఐ మొబైల్ అసిస్టెంట్‌ను సిస్టమ్ స్థాయిలోనే ఇంటిగ్రేట్ చేశారు. దీంతో వాయిస్ కమాండ్లు, మల్టీమోడల్ ఏఐ ఫీచర్ల ద్వారా ఫోన్‌ను నియంత్రించే అవకాశాలు ఉండనున్నాయి.
నూబియా నావిక్స్ అల్ట్రా కోసం పలు ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం చేసుకున్నట్లు నూబియా వెల్లడించింది. డిస్ప్లే ప్యానెళ్లను బీఓఈ, కెమెరా, ఇమేజింగ్ భాగాలను శామ్సంగ్ సెమీకండక్టర్, బయోమెట్రిక్ మరియు ఇంటర్ఫేస్ సొల్యూషన్లను గుడ్డిక్స్ టెక్నాలజీ అందిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఏ మార్కెట్లలో ఎప్పుడు విడుదల చేస్తారు.? ఎన్ని ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లలో తీసుకొస్తారు.? ధర ఎంత ఉంటుంది.? వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అధికారిక లాంచ్ ఈవెంట్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?