80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ChatGPT 80s Photo Trend: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. వర్ణరంజితమైన 1980ల నాటి క్లాసిక్ పోర్ట్రెయిట్ ఫోటోలు అందరి ఫీడ్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. నెటిజన్లు తమ సాధారణ ఫోటోలను చాట్‌జీపీటీకి అందిస్తూ, వాటిని 80ల కాలం నాటి హెయిర్‌స్టైల్స్, నాటి ఫ్యాషన్ దుస్తులు, వార్మ్ స్టూడియో లైటింగ్, పాతకాలపు ఫిలిం గ్రెయిన్ లుక్‌తో వింటేజ్ రీతిలో మార్చుకుంటున్నారు. చాట్‌జీపీటీ ఇచ్చే ఫోటోలు ఎంతో సహజంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ఈ ట్రెండ్ కాస్తా విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే, ఇలా సరదాగా మన ఫోటోను ఏఐ చేతిలో పెట్టడం వెనుక కొన్ని ప్రమాదాలు, గోప్యతా సమస్యలు దాగి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం ఒక ఫోటోను ఏఐ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసినప్పుడు, అది కేవలం ఒక బొమ్మ మాత్రమే కాదు. మన ముఖం అనేది ఒక వ్యక్తిగత సమాచారం (Personal Data). అంతేకాకుండా కొన్ని డిజిటల్ ఫోటోల్లో మెటాడేటా రూపంలో అది తీసిన తేదీ, సమయం, వాడిన ఫోన్, చివరకు లొకేషన్ వివరాలు కూడా దాగి ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఉండే పరిసరాలు, ఇంటి నంబర్లు, రోడ్డు పై ఉండే సైన్ బోర్డులు, నంబర్ ప్లేట్లు లేదా పక్కన ఉన్న ఇతర వ్యక్తుల.. ఇవన్నీ కూడా మన ప్రమేయం లేకుండానే ఏఐ వద్దకు చేరుతాయి. ఓపెన్ ఏఐ నిబంధనల ప్రకారం, యూజర్లు ప్రత్యేకంగా ఆప్ట్-అవుట్ (Opt-out) చేసుకోకపోతే, వారు అప్లోడ్ చేసే కంటెంట్‌ను తమ ఏఐ మోడళ్లను మరింత సమర్థవంతంగా శిక్షణ (Training) ఇవ్వడానికి కంపెనీలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే బిజినెస్ ఖాతాలు, API యూజర్ల డేటాను మాత్రం వారు ట్రైనింగ్ కోసం ఉపయోగించరు.
Also Read
- John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
మరి ఈ ఏఐ ట్రెండ్‌ను అనుసరించడం ఎంతవరకు సురక్షితం?
సాధారణ సెల్ఫీలను ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేయడం వల్ల వెంటనే పెద్ద ప్రమాదం ముంచుకురాకపోవచ్చు. కాకపోతే, మన ప్రైవేట్ ఫోటో ఒకసారి సర్వర్లోకి వెళ్తే అది మన డివైజ్ పరిధి దాటిపోయినట్లేనని గుర్తుంచుకోవాలి. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి చాట్‌జీపీటీలోని Settings > Data Controls లోకి వెళ్లి “Improve the model for everyone” ఆప్షన్‌ను ఆపివేయవచ్చు (Turn off). అలాగే టెంపరరీ చాట్ (Temporary Chat) మోడ్‌ను ఉపయోగిస్తే, మీ డేటాతో ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వరు సరే కదా, 30 రోజుల్లో ఆ డేటా వారి సిస్టమ్స్ నుంచి తొలగించబడుతుంది. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనూ గుర్తింపు కార్డులు, వ్యక్తిగత పత్రాలు, అత్యంత ప్రైవేట్ లేదా సమాజంలో ఇబ్బంది కలిగించే ఫోటోలను అప్లోడ్ చేయకూడదు. ఇతరుల, ముఖ్యంగా పిల్లల ఫోటోలను వారి అనుమతి లేకుండా వాడకపోవడమే మంచిది. ఫోటో అప్లోడ్ చేసే ముందు వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ వివరాలను క్రాప్ చేయడం లేదా బ్లర్ చేయడం ఉత్తమం.
తాజావార్తలు
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!