iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Pro: ఆపిల్ (Apple) నుండి కొత్తగా ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడంతో వాటి ధరలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరలు భారీగా ఉండటంతో చాలామంది వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో తక్కువ ధరలకు ఐఫోన్ 18 ప్రో సిరీస్ లభించే అవకాశం ఉంది. మరి ఆ వివరాలేంటి..? ఎంత తక్కువకు దొరుకుతుందో చూసేద్దామా..
ఆ దేశాల్లో ఐఫోన్ ధరలు తక్కువ..
ప్రపంచంలోని కొన్ని మార్కెట్లలో ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్లు కనపడుతున్నాయి. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్స్ ను విడుదల చేయగా.. వివిధ దేశాలలో వివిధ రకాలుగా ధరలు ఉన్నాయి. అందులో కెనడా, అమెరికా, హాంకాంగ్, మలేషియా, దుబాయ్, జపాన్ వంటి మార్కెట్లలో ధరలు భారత్ లో ఉండే ధరల కంటే తక్కువగా ఉన్నాయి.
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్యాక్స్ రీఫండ్‌తో మరింత తగ్గే అవకాశం..
అయితే కేవలం ఫోన్ ధరను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరిపోదు. ఆయా దేశాల్లో పన్ను రీఫండ్ లేదా ట్యాక్స్ రీఫండ్ అందుబాటులో ఉందా లేదా అనేది కూడా కీలకంగా మారుతుంది. అమెరికా, కెనడా, హాంకాంగ్, మలేషియా వంటి కొన్ని మార్కెట్లలో భారతీయ ప్రయాణికులకు విమానాశ్రయంలో పన్ను రీఫండ్ ప్రయోజనం ఉండదు. కాబట్టి అక్కడ కొనడం ఒకసారి ఆలోచించడం మంచింది.
దుబాయ్, జపాన్‌లో..
దుబాయ్, జపాన్ మాత్రం ట్యాక్స్ రీఫండ్ కారణంగా అక్కడ కొనడం బెస్ట్ ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు దుబాయ్‌లో ఐఫోన్ 18 ప్రో ధర సుమారు రూ.32,000 వరకు తక్కువగా ఉండగా., అక్కడ కొనడం ద్వారా రీఫండ్ పొందడం తర్వాత మరింత సేవింగ్ చేయవచ్చు. ప్రో మ్యాక్స్ విషయంలోనూ ఇదే విధంగా ధర తగ్గే అవకాశం ఉంది. జపాన్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ట్యాక్స్ రీఫండ్ అనంతరం ఐఫోన్ 18 ప్రో ధర సుమారు రూ.23,000 వరకు, ప్రో మ్యాక్స్ ధర సుమారు రూ.35,000 వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే వాస్తవ ధరలు, కరెన్సీ మార్పిడి రేట్లు, పన్ను నిబంధనలు, కొనుగోలు చేసే సమయంలో వర్తించే షరతుల ఆధారంగా మారవచ్చు.
భారత్‌లో జీఎస్టీ ప్రయోజనం ఎలా?
మరోవైపు భారత్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపార సంస్థలు లేదా అర్హత కలిగిన కొనుగోళ్ల విషయంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అందువల్ల విదేశాలకు ప్రత్యేకంగా వెళ్లి ఐఫోన్ కొనుగోలు చేయడం కంటే, ఇప్పటికే విదేశాలకు వెళ్లే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల ద్వారా కొనుగోలు చేయడం కొంతమందికి ఖర్చు తగ్గించే మార్గంగా ఉండవచ్చు.
విదేశాల్లో కొనేముందు ఇవి తప్పక చూడాలి..
అయితే విదేశాల నుంచి ఐఫోన్ కొనుగోలు చేసే ముందు వారంటీ, మోడల్ నంబర్, సిమ్/ఈసిమ్ అనుకూలత, దిగుమతి నిబంధనలు, కస్టమ్స్ నిబంధనలు, ట్యాక్స్ రీఫండ్ అర్హత వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే జీఎస్టీ ప్రయోజనం పొందేందుకు కొనుగోలు అర్హత, ఇన్వాయిస్, వ్యాపార వినియోగం వంటి నిబంధనలు వర్తించవచ్చు.
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!