ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మానవ సంబంధాలు తలదించుకునే ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ బస్తా ప్రాంతానికి చెందిన దంపతులు బైక్ కొనుక్కోవాలనే కారణంతో తమ తొమ్మిది రోజుల నవజాత శిశువును విక్రయించారు. ఆ దంపతులు తమ అమాయకపు బిడ్డను కేవలం రూ.60 వేలకే వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ అక్రమ చర్యపై సమాచారం అందుకున్న పోలీసులు నవ దంపతుల నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. నిందితులైన దంపతులు, తమ బిడ్డను పెంచలేకపోవడం వల్లే తమ బిడ్డను దానం చేశామని చెప్పారు.
READ MORE: Recharge Best Plans: ఓటీటీ ప్లాన్స్ అందించే బెస్ట్ రీఛార్జ్లు ఇవే..
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులైన తల్లిదండ్రులు.. మయూర్‌భంజ్ జిల్లా ఉడాలాలోని సంకుల గ్రామానికి చెందిన సంతానం లేని దంపతులకు తమ బిడ్డను రూ.60,000కు విక్రయించారు. డబ్బును బైక్ కొనుగోలుకు వినియోగించుకున్నారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చిన దంపతులు.. పేదరికం కారణంగా బిడ్డను పెంచుకోలేక బిడ్డను దానం చేసినట్లు తెలిపారు. సిడబ్ల్యుసి సభ్యుడు మన్మోహన్ ప్రధాన్ మాట్లాడుతూ.. “బిడ్డను విక్రయించారనే సమాచారంతో మేము పోలీసులతో కలిసి, బిడ్డను కొనుగోలు చేసిన జంట ఇంటికి వెళ్లాం. అక్కడ నవజాత శిశువును గుర్తించాం. శిశువు సురక్షితంగా ఉంది.” అని పేర్కొన్నారు. ఈ వార్తను ఒడిశా టీవీ.ఇన్ నివేదించింది.
READ MORE: Plane Crash: మా విమానం రష్యా వల్లే కూలింది.. అజర్‌బైజాన్ ప్రెసిడెంట్..