Baby Sale : నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా పుట్టిన పసికందును అమ్మేందుకు ఓ తల్లి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. డబ్బుల విషయంలో చోటుచేసుకున్న గొడవతో ఈ అంశం బయటపడటంతో పోలీసులు విచారణ ప్రారంభించి కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఓ మహిళ తన appena పుట్టిన శిశువును పులాంగ్‌కు చెందిన ఓ దంపతులకు విక్రయించింది. ఈ…
మన దేశంలోని చాలా కుటుంబాల్లో ఆడబిడ్డల కంటే మగ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సామాజిక, ఆర్థిక కారణాలవల్ల కొడుకును ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది. దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు. కడుపులోని ఆడబిడ్డను కడతేరుస్తున్న ఘటనలు మన దేశంలో అనేకం జరుగుతూనే ఉన్నాయి.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మానవ సంబంధాలు తలదించుకునే ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ బస్తా ప్రాంతానికి చెందిన దంపతులు బైక్ కొనుక్కోవాలనే కారణంతో తమ తొమ్మిది రోజుల నవజాత శిశువును విక్రయించారు. ఆ దంపతులు తమ అమాయకపు బిడ్డను కేవలం రూ.60 వేలకే వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ అక్రమ చర్యపై సమాచారం అందుకున్న పోలీసులు నవ దంపతుల నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. నిందితులైన దంపతులు, తమ బిడ్డను పెంచలేకపోవడం వల్లే తమ బిడ్డను దానం…