మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.. 12500 ఎకరాలు ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉత్పాదకత సుమారు ఎకరాకు 50 టన్నులు ఉంది. అనంతపూర్, కడప, మెదక్, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలోను కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది.. వీటికి మార్కెట్ లో ఎప్పటికి డిమాండ్ ఉంటుంది.. అందుకే పండ్లను పండించే రైతులు ఎక్కువగా బొప్పాయిని పండిస్తున్నారు.. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.. అనేక ఔషదాలలో కూడా వాడతారు. ముఖ్యంగా ఉదర సమస్యలను బొప్పాయి వలన నివారించబడతాయి. బొప్పాయి పాల నుండి తీయబడిన పపయిన్ అనే ఎంజైమ్ను అనేక పరిశ్రమలలో మందుల తయారీలో వాడుతున్నారు…
ఈ పండ్ల సాగుకు ఎర్ర గరప నేలలు నీరు బాగా మధ్య రకం నల్ల రేగడి నేలలు అనుకూలం. ఎట్టి పరిస్థితులలోను మొక్క మొదలు దగ్గర నీరు నిలువ ఉండకూడదు. హెక్టారుకు 20 కిలోల పశువుల ఎరువును భూమిలో వేసి బాగా దున్నాలి. ప్రతి మొక్కకు 250 గ్రాముల యూరియా ఎరువులను ప్రతి 2 నెలలకు ఒకసారి చొప్పున మొక్కలు నాటిన 2 నెలల తర్వాత నుంచి ప్రారంభించి మొత్తం 6 మోతాదులుగా వేయవలెను.. ఈ పంటకు ఎక్కువగా డ్రిప్ ను వాడటం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.. సుమారు 8-10 రోజులకు ఒక సారి నీటిని ఇవ్వాలి. అదే పెద్ద మొక్కలకైతే ప్రతిరోజు 20-25 లీటర్ల నీటిని ఇవ్వాలి. రింగు పద్ధతిలో వేసవిలో 4-6 రోజుల కొకసారి, చలి కాలంలో 8-10 రోజులకొకసారి నీరు ఇవ్వాలి..
బొప్పాయి మొక్కలను నాటిన 4-5 నెలల నుంచి పూత, కాత ప్రారంభమగును. పూత వచ్చిన 4 నెలలకు కాయ తయారవుతుంది. పండు కొద్దిగా పసుపు రంగుకు మారినపుడు బొప్పాయిని కోయవలెను. పండ్లు సంవత్సరం పొడవునా వచ్చును.. మొక్కలు బలంగా తయారవ్వాలి.. నాటిన 4-5 నెలల నుంచి పూత, కాత ప్రారంభమగును. పూత వచ్చిన 4 నెలలకు కాయ తయారవుతుంది. పండు కొద్దిగా పసుపు రంగుకు మారినపుడు బొప్పాయిని కోయవలెను. పండ్లు సంవత్సరం పొడవునా వచ్చును. కాయలను మొక్కల మీద మాగనివ్వరాదు. నాటిన 9 వ నెల నుండి 2 సంవత్సరాల వరకు పండునిస్తుంది.. మొక్కలను నాటిని 8వ నెల నుంచి 2 ఏళ్ల వరకు పంట దిగుబడిని ఇస్తుంది.. దాదాపు 30 టన్నుల ఈ పంట గురించి ఇంకేదైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..