మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పండ్లలో బొప్పాయి కూడా ఒకటి.. 12500 ఎకరాలు ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉత్పాదకత సుమారు ఎకరాకు 50 టన్నులు ఉంది. అనంతపూర్, కడప, మెదక్, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలోను కోస్తా జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది.. వీటికి మార్కెట్ లో ఎప్పటికి డిమాండ్ ఉంటుంది.. అందుకే పండ్లను పండించే రైతులు ఎక్కువగా బొప్పాయిని పండిస్తున్నారు.. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.. అనేక ఔషదాలలో కూడా వాడతారు.…