Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో రవి కత్తితో దాడి చేయడమే కాకుండా, పోలీసు జీప్‌పై కర్రలతో దాడి చేశాడు. దీంతో కొంతసేపు పామిడి పట్టణంలో గందరగోళ వాతావరణం నెలకొంది.…