Tilak Varma Dating: టీమిండియా బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఆటగాడు ఓటమికి ఎదురు నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా తిలక్ వర్మ ఒక కొత్త రూమర్‌తో వార్తల్లో నిలిచాడు. ఈ టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ నేపాలీ క్యూట్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నాడంటా. ఈ పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నేపాలీ క్యూట్ క్రికెర్ ఎవరో తెలుసా.. ఇందు బర్మా. తిలక్ వర్మ – ఇందు బర్మా మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ పుకార్లపై ఇరువైపుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
READ ALSO: కొత్త ఏడాదిలో వినియోగదారులకు Mercedes-Benz షాకింగ్ న్యూస్.. మరింత పెరగనున్న కార్ల ధరలు
ఇందు బర్మా ఎవరంటే..
నేపాల్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు ఈ 28 ఏళ్ల ఇందు బర్మా . నేపాల్ మహిళా క్రికెట్ జట్టులో ఆమె బ్యాటింగ్ ఆల్ రౌండర్. ఆమె కుడిచేతి వాటం బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుంది. ఇందు బర్మా నేపాల్‌కు 78 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. బ్యాట్‌తో 1041 పరుగులు చేసింది, అలాగే 40 వికెట్లు పడగొట్టింది. ఈ మహిళా క్రికెటర్ కేవలం తన ఆటతోనే కాకుండా, తన అందంతో, క్యూట్‌నెస్‌తో సెన్సేషన్ సృష్టిస్తుంది.
తిలక్ వర్మ విషయానికి వస్తే..
ప్రస్తుతం దక్షిణాఫ్రికా – టీమిండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ భారత్ జట్టులో తిలక్ వర్మ సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో తిలక్ వర్మ పాత్ర కూడా కీలకమైనది. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పటివరకు భారతదేశం తరపున ఐదు వన్డేలు, 38 టీ20లు ఆడాడు.
READ ALSO: BRS : ఈనెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ కీలక సమావేశం