Site icon NTV Telugu

Palnadu Ra*pe Case: మహిళా ఉద్యోగిని అత్యాచారం కేసులో కీలక మలుపు.. అదుపులో అనుమానితుడు..!

Palnadu Rape Case

Palnadu Rape Case

Palnadu Rape Case: పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ప్రియుడే ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సిసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈ నెల 2న మహిళా ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహంగా ఉంది నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, కత్తితో బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. అత్యాచారం చేసిన తర్వాత తనను తీవ్రంగా గాయపరిచినట్టు కూడా చెప్పింది బాధితురాలు.

Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్‌లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!

ఈ కేసును విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీం ఫారెన్సిక్ టీమ్ ను రంగంలోకి దించారు. బాధిత మహిళ ఇంట్లో ఆధారాలు సేకరించారు. దీంతో పాటు ఇంటి సమీపంలో ఉన్న సిసి ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. బాధిత మహిళ చెప్పిన సమయంలో ఆ వీధిలోకి ఎవరెవరు వచ్చారో గమనించారు. మహిళ చెప్పిన సమయంలో ఓ యువకుడు వచ్చినట్టు గుర్తించారు. కానీ బాధితురాలు తనపై 45 నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!

బాధిత మహిళతో పాటు సిసి ఫుటేజ్ లో కనిపించిన యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడింది సిసి ఫుటేజ్ లో ఉంది ఒక్కరే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ లోని యువకుడు పల్నాడు జిల్లా రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్ (30) గుర్తించారు పోలీసులు. ఆ యువకుడు కొంతకాలంగా మహిళతో రిలేషన్షిప్ లో ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆమెపై అనుమానంతో యువకుడు దారుణంగా ప్రవర్తించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడిని మాచర్లకు తరలించి అక్కడ విచారించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.

Exit mobile version