Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు.
Bengal Rape Case: బెంగాల్‌లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్‌కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Crime: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ రాజీవ్ బిందాల్ అన్నయ్య రామ్ కుమార్ బిందాల్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. డాక్టర్ అయిన రామ్ కుమార్ తనకు చికిత్స చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసినట్లు మహిళ ఆరోపించింది. అత్యాచార బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. చికిత్స చేసినప్పటికీ తనకు ఎటువంటి ఉపశమనం లభించలేదని ఆమె అన్నారు.…
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఏడుగురు నిందితులు ఐదు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. సోషల్ మీడియాలో స్నేహం చేసి.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు నిందితులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో 17 ఏళ్ల బాలికకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులు ఆమెపై ఐదు నెలల పాటు బ్లాక్‌మెయిల్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో ఆమె గర్భం…
Prajwal Revanna: మహిళపై అత్యాచారం చేసిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూర్ కోర్టు ‘‘జీవిత ఖైదు’’ శిక్షను విధించింది. తన ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆ చర్యని వీడియో తీసి, పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీంతో కోర్టు అతడికి జీవితఖైదు శిక్షను విధించింది. రూ. 524 నెలవారీ వేతనం కోసం 8 గంటల పాటు రోజూవారీ పని చేయాలని ఆదేశించింది.
Kolkata: కోల్‌కతాలో మరో అత్యాచార సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హత్యాచారం, కోల్‌కతా లా కాలేజ్‌లో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటనలు మరవక ముందే,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కలకత్తాలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఐఎంలో చదువుతున్న విద్యార్థినిపై క్యాంపస్ హస్టల్‌లో మరో విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Kurnool POCSO Court Sentences Man to 20 Years in Jail: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో ఎల్లయ్య అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు రూ.50 వేలు జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2021 జనవరి 26వ తేదీన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్లపై బాలికపై ఎల్లయ్య అత్యాచారం…
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష , 50 వేల రూపాయల జరిమానా విధించింది పోక్సో కోర్టు..
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో రూ.10 రూపాయలు ఇచ్చి మైనర్ బాలిక పై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. షీటీం అవగాహనతో విషయం బయటకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.. నిందితుడు బంగారిగూడకు చెందిన జాదవ్ కృష్ణగా గుర్తించి అరెస్టు చేశారు.
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.