నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా... మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్…
రేపు పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. 10:40కి మాచర్ల చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. యాదవుల బజారులో స్వఛ్చాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. పారిశుధ్య కార్మికులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఎస్.కె.బి.ఆర్. కాలేజీ గ్రౌండ్ లో ప్రజావేదికలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి హెలికాప్టర్ లో ఉండవల్లికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు.
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌కు షాకిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మున్సిపల్ చైర్మన్ పదవి నుండి తురఖా కిషోర్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.. ఏపీ మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 16(1)(కె )ను ఉల్లంఘించినందుకు తురఖా కిషోర్‌ను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తొలగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ...పార్టీని రీ సెట్ చేసే పనిలో సీరియస్‌గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ క్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ... భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతుండటంతో... మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలొచ్చినంత మాత్రాన ఆల్ హ్యాపీస్ కాదా? ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటున్నారా? వరుసబెట్టి వస్తున్న ఫిర్యాదులు ముందు ముందు మంట పుట్టించబోతున్నాయా? పిన్నెల్లి చుట్టూ పొలిటికల్ ఉచ్చు గట్టిగానే బిగుస్తోందా? అసలు మాచర్లలో ఏం జరుగుతోంది? మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితులమంటూ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. భూ కబ్జాలు, బెదిరింపులపై ఫిర్యాదుల పరంపర పెరుగుతోంది. తమను బెదిరించి పిన్నెల్లి, ఆయన అనుచరగణం ఆస్తులు లాక్కున్నారని, వాళ్ళ…
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరు పరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేసిన అంశంపై ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Julakanti Brahmananda Reddy Met Balakrishna: నందమూరి బాలకృష్ణ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పాలిటిక్స్ కూడా చేస్తున్న ఆయన ఈ మధ్యనే మూడవ సారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రతినిధులు నందమూరి బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌కు బాలయ్య ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించినందుకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మొన్న ఈమధ్యనే…