మీ తాళం చెవితోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు తెలుసా? అలాంటి దొంగలు కూడా హైదరాబాద్‌లో తిరుగుతున్నారు. తాజాగా ఓ యువతి అలాగే దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. Also Read: Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్ ఇంటికి తాళం వేసి షూ స్టాండ్‌లోనో, పక్కన కిటికీలోనో.. చెట్ల పొదల్లోనో తాళం చెవి దాచేస్తున్నారా? ఐతే మీ తాళం చెవితోనే మీ ఇంటిని దోచేస్తారు..…
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. కానీ.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇట్టే పట్టేసుకున్నారు. వాస్తవానికి.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శిర్డీ హిల్స్‌లో చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో దొంగతనం చేసినవారు ఎవరూ కాదండీ.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంతో విశ్వాసంతో శివుడికి అభిషేకం చేసే పాలలో ఓ వ్యక్తి ఉమ్మేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాలు కొనుగోలు చేసే లవ్ శుక్లా అనే వ్యక్తి సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. వాస్తవానికి.. లవ్ శుక్లా బంకే బిహారీ, కన్వర్ యాత్రల సమయంలో శంకర్జీ(శివుడు)కి అభిషేకం చేయడానికి ఈ పాలను ఉపయోగించేవాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా…
ప్రియుడు కోసం పెళ్లి మండపంలో ప్రియురాలు దొంగతనం చేసింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి లో ఘటన చోటు చేసుకుంది.. ప్రియుడి అవసరాల కోసం ఓ పెళ్లి మండపంలో 21 సవరాల నగలను ప్రియురాలు జ్యోతి దొంగతనం చేసింది.. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ప్రియుడు, ప్రియురాలితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడు అప్పును తీర్చడానికి, జల్సాల కోసం దొంగతనం చేసినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.
యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన చిడేమ్ సాయి అనే యువకుడు ఈ నెల 15వ తేదీన రాత్రి 7 గంటలకు మిస్సింగ్ అయినట్లు 16న స్టేషన్‌లో కేసు నమోదైంది. అదృశ్యమైన ప్రాంతం హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో సాయి కుటుంబ సభ్యులు 18వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సంచలన విషయం వెల్లడైంది. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ వివాహేతర…
జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవలే కిడ్నప్ కు గురైన 10 నెలల పసి పాప శివాని కేసును జనగామ పోలీసులు ఛేదించారు. పాపను కిడ్నప్ చేసిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఏసీపీ పండేరి చేతన్ నితిన్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన రామ్ జూల్ - పార్వతి దంపతులు జిల్లా కేంద్రంలో కూలి పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నారు..