Delhi Car Blast: వారం క్రితం ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద కారు బాంబ్ పేలింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘‘వైట్ కాలర్’’ మాడ్యూల్‌గా పిలువబడుతున్న ఈ ఉగ్రదాది వెనకాల ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు సూత్రధారులుగా ఉన్నారు.
Jogi Ramesh: విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో నాలుగు గంటలుగా వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన ఇంటిలో సిట్ అధికారుల తనిఖీలు చేపట్టారు.
UPSC Aspirant Murder: తిమార్‌పూర్‌లోని గాంధీ విహార్ ప్రాంతంలో జరిగిన యూపీఎస్సీ విద్యార్థి రామ్‌కేష్ మీనా హత్య చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆధారాలను నాశనం చేయడానికి, రామ్‌కేష్ ప్రియురాలు అమృత చౌహాన్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్న అమృత తన చదువును ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. హత్యకు ముందు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక క్రైమ్ వెబ్ సిరీస్‌లను సైతం చూసింది. ఎన్ని చేసిన తప్పించుకోలేక పోయింది.
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్‌కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్‌గా పని…
Bengal Rape Case: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది. ఒడిశా జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి, దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. అక్టోబర్ 10న యువతి తన స్నేహితుడి కోసం బయటకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
Kanpur Blast: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మర్కజ్ మసీదు సమీపంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వివరాల ప్రకారం, మూల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరంలో పేలుళ్ల కారణంగా ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. పేలుళ్ల దాడికి ఇళ్లు, సమీపంలోని దుకాణాల గోడలు పగిలిపోయాయి. పార్క్ చేసి ఉన్న రెండు స్కూటర్లలో ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. Read…
పూణే కోంధ్వా ప్రాంతంలోని ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొరియర్ డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన వ్యక్తి 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సహజీవనం చేస్తున్న జంట దారుణానికి పాల్పడింది. తమ ఇద్దరు నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టింది. సంవత్సరాల తరువాత వారి అవశేషాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయారు. 25 ఏళ్ల భవిన్ పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఇద్దరు నవజాత శిశువుల అవశేషాలను పోలీసులకు అప్పగించి తన నేరాన్ని అంగీకరించాడు.తాను, తన లివ్-ఇన్ పార్టనర్ అనిషా (22) పిల్లలు పుట్టిన వెంటనే వారిని పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.…
Gulzar House: హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో చోటుచేసుకున్న గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పట్ల అధికార యంత్రాంగం సీరియస్‌గా స్పందిస్తోంది. భారీగా ప్రాణనష్టం చోటుచేసుకున్న ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక శాఖలు తమవంతుగా ఆధారాలను సేకరించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని నాగ్‌పూర్‌కు చెందిన ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందం పరిశీలిస్తోంది. నీలేష్ అఖండ నేతృత్వంలోని ఈ బృందం టెక్నికల్ విశ్లేషణల ద్వారా ప్రమాదానికి కారణాలపై దృష్టిసారించింది. ఈ బృందం నివేదిక కీలకంగా మారనుంది.…
Gulzar House Fire Incident: హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ భవనంలో సంభవించిన ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఇప్పటికే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే క్లూస్, ఫోరెన్సిక్…