బాలీవుడ్ లవర్ బాయ్ షాహీద్ కపూర్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. పోనీ అంత ముందు భారీ హిట్ ఉందా అంటే అదీ లేదు. భారీ బడ్జెట్ చిత్రమా అదీ కాదు. మూవీ కోసం కాకుండా జస్ట్ వెబ్ సిరీస్ కోసమే శాలరీని హైక్ చేశాడట. ఈ ఏడాది దేవాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాహీద్ భారీ డిజాస్టర్ చూసిన సంగతి విదితమే.
Also Read : DDNextLevel : కోలీవుడ్ నటుడు సంతానంపై కేసు నమోదు.. కారణం ఇదే
2023లో వచ్చిన ఫర్జీ మంచి వ్యూస్ దక్కించుకుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, రెజీనా కీ రోల్స్ పోషించిన ఈ బొమ్మను దర్శక అండ్ ప్రొడ్యూసర్ ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. హవాలా, దొంగ నోట్ల ముద్రణ నేపథ్యంలో వచ్చిన ఫర్జీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు రాజ్ అండ్ డీకే. ఈ సిరిస్ కోసమే భారీగా చార్జ్ చేస్తున్నాడట షాహీద్.కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్టుతో షాహీద్ కపూర్ రేంజ్ మారింది. కానీ వరుసగా పరాజయాలు పలకరించాయి. జెర్సీ, దేవాతో హిట్ ట్రాక్ తప్పింది. అయినప్పటికీ ఫర్జీ 2కోసం భారీగా డిమాండ్ చేస్తున్నాడట యంగ్ హీరో. సాధారణంగా ఓ సినిమాకు రూ. 20 నుండి రూ. 30 కోట్లు చార్జ్ చేసే షాహీద్.. ఫర్జీ 2 కోసం ఏకంగా రూ. 45 కోట్లు అడిగాడట. అయినప్పటికీ ఇచ్చేందుకు యాక్సెప్ట్ చేశారట రాజ్ అండ్ డీకే. ప్రెజెంట్ అర్జున్ ఉస్తారా చేస్తున్నాడు షాహీద్. అలాగే రక్త బ్రహ్మాండ్ తెరకెక్కిస్తున్నారు రాజ్ అండ్ డీకే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఫర్జీ2పై ఫోకస్ చేయనుంది టీం. కానీ ప్లాప్ ఉన్నా కూడా షాహీద్ కు సుమారు రూ. 50 కోట్లు ఇవ్వడం ప్రస్తుతం బీటౌన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.