ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది.
భవిష్యత్తులో ఇంధనాన్ని అధిక ధరలకు విక్రయించాలనే లక్ష్యంతో కొందరు ఫిల్లింగ్ స్టేషన్ల యజమానులు హోర్డింగ్‌కు పాల్పడుతున్నారని, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు రూపాయి భారీ షాక్ ఇచ్చింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంలా తయారైంది పాక్ పరిస్థితి.
దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం అధికంగా ప్రభావం చూపుతోంది. సంక్షోక్షం తలెత్తడంతో ఆ దేశ సర్కారు నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాక్... తన ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది.