పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ తీవ్ర కలత చెందింది. ప్రతిరోజు ఆదేశానికి చెందిన నాయకులు ఏదో ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. భారతదేశం ప్రతీకార చర్యకు పాకిస్థాన్ భయపడుతుందని అర్థమవుతోంది. తాజాగా పాకిస్థాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్థాన్‌కు నీటిని నిలిపివేస్తే, దానికి తగిన సమాధానం ఇస్తామని అన్నాడు.