కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం ధర్మరాజు పల్లి గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 3న ధర్మారాజుపల్లి ఆశీర్వాదాం తో బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి గెలుస్తున్నాడన్నారు. గ్రామంలో మిగిలి ఉన్న పనులన్నీ అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బంధు అంటేనే ధర్మారాజుపల్లి గుర్తు అని, నిత్యం మీ వెంటనే ఉంటున్న నా కష్టాన్ని గుర్తుకు చేసుకోండన్నారు పాడి కౌశిక్ రెడ్డి. నేను మీ కళ్ళల్లో మెదిలే బిడ్డను మరిచిపోకండని, పనికి రాని గాడుధులు మాట్లాడుతారు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
Also Read : Boat Capsizes: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం.. 18 మంది గల్లంతు..
ధర్మరాజు పల్లి గ్రామంలో నలుగురు యువకులు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఢిల్లీకి రాజు ఐన ధర్మారాజుపల్లి కి కొడుకునేనని, నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి అని ఆయన వ్యాఖ్యానించారు. పోయిన సారి చేసినట్లు చేయకండి బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుకి ఓటు వేయండన్నారు పాడి కౌశిక్‌రెడ్డి. బీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో అన్ని వర్గాల కోసం ఆలోచించి రూపొందించామని, దాంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టో కూడా తయారు చేశానని అన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్ నియోజకవర్గం మార్చి చూపిస్తానని అన్నారు. కొత్త మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేస్తూ సౌభాగ్య లక్ష్మి పేరిట ప్రతి మహిళకు 3000 అందిస్తామన్నారు.
Also Read : Rahul Gandhi: రేపు మంథని నియోజకవర్గంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పర్యటన