ఆంధ్రప్రదేశ్ లో పీ4 కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ జీరో పావర్టీ లోగోను ఆవిష్కరించారు. P 4 పోర్టల్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. పేదల బాగు కోసం.. మార్గదర్శి-బంగారు కుటుంబం నినాదం ఇచ్చారు. పీ4లో ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వాములుగా ఉండనున్నారు. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యమన్నారు. పేదరికం నుంచి ప్రజలను పైకి తేవాలనేది పీ4 పథకం ఆశయంగా చెప్పారు.
Also Read:CM Chandrababu: ఏపీలో పేదరిక నిర్మూలన నా జీవిత లక్ష్యం..
ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల ప్రజలను ప్రభుత్వం ఆహ్వానించింది. మార్గదర్శి నుంచి సహాయం అందించే రెండు కుటుంబాలకు వేధిక పైకి ఆహ్వానించారు. మొదటి మార్గదర్శి అనిల్.. రెండో మార్గదర్శి సజన్ కుమార్ గోయెంక.. మూడో మార్గదర్శి మేఘా ఇంజినీరింగ్ అధినేత కృష్ణారెడ్డి. తొలి P4 కుటుంబంగా మంగళగిరి నియోజకవర్గం కురగల్లుకు చెందిన కడియం నరసింహ, కడియం సుశీల ఎంపికయ్యారు. గొర్రెలు పెంపకం వృత్తి. రెండవ బంగారు కుటుంబంగా మచ్చ ఇమాన్యుయెల్ కుటుంబం ఎంపికైంది.
Also Read:Maoists:మావోయిస్టులను కగార్.. కంగారు పెట్టేస్తుందా..?
సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది ధనికులు 20 శాతం మంది నిరుపేదలను ఆదుకొని పైకి తెచ్చే కార్యక్రమంగా పి4 రూపకల్పన చేశారు. P 4 కార్యక్రమం ద్వారా లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబంగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా దశల వారీగా 50 లక్షల మంది నిరుపేదలను ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అర్హత గల 28 లక్షల కుటుంబాలను p4 కోసం ప్రభుత్వం గుర్తించింది.