తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో మధ్యాహ్నంలోపు మృతదేహాల వెలికితీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు.
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.