తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో మధ్యాహ్నంలోపు మృతదేహాల వెలికితీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు.
తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.
SLBC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన జరిగి ఎనిమిదో రోజుకు చేరుకుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను…