Manchu Vishnu: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. సినిమా వివరాల గురించి అడిగిన వారితో పాటు, వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించిన వారికి కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇక ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా శైవభక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో విష్ణు ప్రధాన పాత్రలో నటించడంతో పాటు, అత్యున్నత స్థాయిలో నిర్మాణ విలువలు కలిగి ఉండేలా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. టీజర్ విడుదల సందర్భంగా విష్ణు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్‌చాట్ చేశారు.
Read Also: New Traffic Rules In AP: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు!
ఇందులో అభిమానులు సినిమాకు సంబంధించిన వివరణలు అడిగితే.. కొంతమంది విష్ణు వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. నెటిజన్లలో ఒకరు, మంచు కుటుంబానికి సంబంధించిన ఓ వివాదంపై ప్రశ్నించగా.. విష్ణు దానికి సరదాగా స్పందించారు. ఒక నెటిజన్, ‘‘మాకు సమాధానం ఇచ్చే మంచి మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్‌లో షుగర్ ఎందుకు వేశావ్ అన్నా?’’ అని ప్రశ్నించగా.. విష్ణు తనదైన శైలిలో ‘‘ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని చదివా’’ అని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యకు నెటిజన్లు వినోదంగా స్పందించారు.
Fuel lo sugar vesthe mileage peruguthundi ani WhatsApp lo chadivanu… #AskVishnu
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2025
Read Also: Sumanth Reddy: భార్య దాష్టికానికి డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి
ఈ ఘటనకు ముందు, విష్ణు తమ్ముడు మంచు మనోజ్ తమ ఇంటి వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేయడానికి విష్ణు జనరేటర్‌లో షుగర్ పోశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. విష్ణు సినిమాపై ఆసక్తి చూపిన అభిమానులు ‘కన్నప్ప’ గురించి మరిన్ని వివరాలు కోరగా, ఆయన సినిమాపై ప్రస్తుతానికి ఎక్కువ సమాచారం ఇవ్వకుండా ఉంచారు. అయితే, త్వరలోనే అఫీషియల్ ట్రైలర్, సాంగ్స్, మిగతా అప్‌డేట్స్ విడుదలవుతాయని హింట్ ఇచ్చారు. ఈ చాట్‌లో ఆయన వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలకు సరదాగా స్పందించినా, ‘కన్నప్ప’ సినిమా గురించి అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించేలా చేశారు. ఈ టీజర్ విడుదల అనంతరం సినిమా అంచనాలు ఎలా మారతాయో చూడాలి.